Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హోంబలే ఫిలింస్ పతాకంపై విజరు కిరగందూర్ నిర్మించిన తాజా చిత్రం 'కాంతార'. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ చిత్రం కన్నడ వెర్షన్లో సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సష్టించింది. తాజాగా ఈ సినిమా తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడలో మాదిరిగానే తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. మొదటి రోజు 1.95 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం బుధవారానికి 20 కోట్లు గ్రాస్‌ను సాధించింది. కన్నడలో 17 రోజుల కలెక్షన్స్‌ను తెలుగులో కేవలం రెండు రోజుల్లోనే కొల్లగొట్టింది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, ' మేం రిలీజ్ చేసిన ఈ చిత్రాన్ని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు.ఈ సినిమా ఏం ప్రూవ్ చేసింది అంటే సినిమాకు లాంగ్వేజ్ బ్యారియర్ లేదు. కానీ ఎమోషన్ బ్యారియర్ మాత్రమే ఉంటుంది. ఏ ఎమోషన్లో సినిమా తీశారో ఆ ఎమోషన్‌కు కనెక్ట్ అయ్యి చేశారు.ఈ కథను ఇంగ్లీష్ నుంచో, యూరోపియన్ నుంచో, కొరియన్ నుంచో చూసి రాసుకున్న కథ కాదు. వారి ఊరిలో జరిగిన కొన్ని విశేషాలను తీసుకుని రాసుకున్న కథ. బన్నీ వాసు నన్ను అర్జంట్‌గా ఈ సినిమా చూడమంటే కన్నడలో చూశాను. ఈ సినిమా చూసిన తర్వాత విష్ణుతత్వం, రౌద్ర రూపం ఇవన్నీ కలిపి వైజాగ్ దగ్గర ఉన్న మన సింహాచలంకు దగ్గరగా ఉన్న కథ అనిపించింది. ఈ సినిమాలో హీరో ఎమోషన్స్‌కు ఫీలై అద్భుతంగా నటించాడు అనే దానికంటే జీవించాడు అని చెప్పవచ్చు. అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. జనరల్‌గా నేను డబ్బింగ్ సినిమాలు రిలీజ్ చేసేది చాలా తక్కువ. ఈ సినిమా చూసిన తరువాత ఇందులోని ఎమోషన్స్‌కు, హీరో పెర్ఫార్మన్స్‌కు ముగ్ధుడినై ఈ సినిమాకు కనెక్ట్ అయ్యాను.ఈ ఎమోషన్స్ తెలుగు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగులో రిలీజ్ చేశాం. అన్ని చోట్ల నుండి ఊహించని రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలో రిషబ్ శెట్టి మా గీతా ఆర్ట్స్‌లో సినిమా చేయడానికి ఒప్పుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది' అని అన్నారు.
హీరోయిన్ సప్తమి గౌడ మాట్లాడుతూ, 'లీల పాత్రలో నన్ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు రుణపడి ఉంటాను' అని తెలిపారు.
మా ''కాంతార'' సినిమాను అగ్ర నిర్మాత అల్లు అరవింద్ షార్ట్ టైమ్‌లో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తెలుగులో రిలీజ్ చేయడంతో, రిలీజైన ప్రతిచోటా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకు సహకరించిన రామారావుకి ధన్యవాదాలు. ఈ సినిమా నాకు మంచి ఎనర్జీ ఇచ్చింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదని తెలుగు ప్రేక్షకులు నిరూపించారు. మూడు రోజుల్లో 20 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. ఇంత విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు.
- హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి