Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీఎ2 పిక్చర్స్‌లో అల్లు శిరీష్ నటించిన తాజా చిత్రం 'ఉర్వశివో రాక్షసివో'. ఈ చిత్రానికి 'విజేత' సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. అను ఇమ్మాన్యూల్ కథానాయిక. ధీరజ్ మొగిలినేని నిర్మాత. విజరు.ఎం సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న సందర్బంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
సమర్పకులు అల్లు అరవింద్ మాట్లాడుతూ, 'ఇలాంటి మంచి కథ ఇచ్చిన భరధ్వజకి ధన్యవాదాలు. జూబ్లీహిల్స్ కుర్రాడ్ని మిడిల్ క్లాస్‌కు చూయించాలి అనే బిగ్గెస్ట్ ఛాలెంజ్‌తో తీసిన సినిమా ఇది. ఈ సినిమా చూసిన వారందరూ ఫుల్ ఎంజారు చేస్తారు. మ్యూజిక్ డైరెక్టర్స్ అనూప్‌రూబెన్స్, అచ్చు రాజమణి చాలా మంచి పాటలు ఇచ్చారు. ఈ నెల 30న జరుపుకునే ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ఇక ముఖ్యమైన అతిథి వచ్చి, మనకు విశిష్టమైన అప్పిరియన్స్ ఇచ్చే ఆ ఫంక్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది' అని చెప్పారు.
'దాసరి నారాయణ రావు, బాలచందర్ మిడిల్ క్లాస్ సమస్యలను హృద్యంగా, చాలా అందంగా, సరదాగా చెప్పేవారు. వారు వెళ్ళిపోయిన తరువాత మిడిల్ క్లాస్ సినిమాలు తగ్గిపోయిన ఈ రోజుల్లో ఆలా బాగా చూపించిన సినిమా ఇది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు నవ్వుకుంటూ బయటకు వచ్చి, ఇంటికెళ్లిన తరువాత కూడా ఈ సినిమా గురించి ఆలోచించే విధంగా ఉంటుంది' అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.
దర్శకుడు రాకేష్ శశి మాట్లాడుతూ, 'ప్రస్తుత యూత్ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి అనే పాయింట్‌ను బేస్ చేసుకుని ఈ సినిమా తీశాం. యువతీ యువకులకు ఈ పాయింట్ బాగా కనెక్ట్ అవుతుందని చాలా స్ట్రాంగ్‌గా చెప్పగలను' అని తెలిపారు. హీరోయిన్ అను ఇమ్మాన్యూల్, 'మా చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే టీజర్ చూసి చాలా మంది ఈ సినిమాను ఫ్యామిలీతో చూడవచ్చా అని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఫ్యామిలీతో కలిసి చూసేలా ఈ సినిమా ఉంటుంది' అని అన్నారు. సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ,'ఈ సినిమాలో 'మాయారే..' అనే ఒకే ఒక సాంగ్ చేశాను. ఈ సాంగ్‌కు ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శిరీష్‌తో ముందు ముందు ఫుల్ ఆల్బమ్ చేస్తాను' అని చెప్పారు. 'ఇప్పటి వరకు ఈ సినిమా నుండి వచ్చిన పాటలు ట్రెండింగ్‌లో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఈ సినిమా నుండి మంచి సింగర్స్ పాడిన మెలోడీ సాంగ్స్ రాబోతున్నాయి. ఈ పాటలు కూడా ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తాయి' అని మరో సంగీత దర్శకుడు అచ్చు రాజమణి తెలిపారు.
ఒక సినిమాలో ఎంటర్టైన్మెంట్ చేయడం కష్టం కాకపోవచ్చు. కానీ ఒక సినిమా చూసిన తర్వాత కూడా ఆ సినిమా గురించి ఆలోచించేలా చేయడం చాలా కష్టం. అలా మా డైరెక్టర్ రాకేష్ ఈ చిత్రాన్ని డిజైన్ చేశారు. ఇలాంటి సినిమాలో నేను నటించినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. విజయం ఖాయం.
- హీరో అల్లు శిరీష్