Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీకాంత్ గుర్రం, బుజ్జి (హేమలతా రెడ్డి) హీరో, హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'నిన్నే చూస్తు'. కె.గోవర్ధనరావు దర్శకత్వంలో పోతిరెడ్డి హేమలతా రెడ్డి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 27న ఈ సినిమా విడుదలకు సిద్ధమైన సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నటులు సుమన్, ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి, నిర్మాత రామ సత్యనారాయణతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
హీరోయిన్, నిర్మాత పోతిరెడ్డి హేమలతా రెడ్డి మాట్లాడుతూ, 'కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా ప్రేమ ఎప్పుడూ ఓడిపోకూడదు అనే ఆలోచనతో, పెద్దలతోపాటు ప్రేమికులకు అర్థమయ్యే రీతిలో ఈ చిత్రాన్ని నిర్మించాం. మంచి కథతో నాకు ఇష్టమైన హీరో సుమన్, భానుచందర్, సుహాసిని, షియాజి షిండే, కిన్నెరతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఇందులో ఉన్న ఆరు పాటలు అద్భుతంగా వచ్చాయి' అని తెలిపారు. 'ఇలాంటి మంచి ప్రేమకథా చిత్రం చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత హేమలత రెడ్డి (బుజ్జి )కి ధన్యవాదాలు. మంచి కంటెంట్‌తో వస్తున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను' అని దర్శకుడు చెప్పారు.