Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజువల్ ఎఫెక్ట్స్, స్క్రిప్ట్ రైటింగ్‌లో విశేషమైన అనుభవం కలిగిన రాజు బొనగాని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న న్యూ ఏజ్ లవ్ స్టోరీ 'ఎంగేజ్మెంట్'. బొనగాని ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నూతన హీరో హీరోయిన్లను పరిచయం చేస్తూ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం స్క్రిప్టు పనులు ముగించుకుంది. అలాగే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌తోపాటు దిలీప్ బండారి సంగీత సారథ్యంలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుపుకుంటోంది.
ఈ సినిమా గురించి దర్శక, నిర్మాత రాజు బొనగాని మాట్లాడుతూ, 'పెళ్లి చూపులతో మొదలై... ఎంగేజ్మెంట్తో శుభం కార్డు పడే ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ ఇది. యూనివర్సల్ అప్పీల్ కలిగిన సబ్జెక్ట్ కావడంతో తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నాం. దిలీప్ బండారి మ్యూజిక్, మన్నం వెంకట్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ఆయువుపట్టుగా నిలుస్తాయి. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశాం. న్యూ ఫేసెస్ కోసం ఆడిషన్స్ చేస్తున్నాం. డిసెంబర్లో సెట్స్‌కు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు.