Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శివకార్తికేయన్ కథానాయకుడిగా, అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన చిత్రం 'ప్రిన్స్'. మారియా ర్యాబోషప్క కథానాయిక. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు.
దీపావళి కానుకగా ఈనెల 21న విడుదలైన ఈ చిత్రం హిలేరియస్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో దర్శకుడు అనుదీప్ మీడియాతో మాట్లాడుతూ, 'మా చిత్రానికి అన్ని చోట్ల నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులు హిలేరియస్‌గా ఎంజారు చేస్తున్నారు. తమిళంలో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. రెండో రోజు నుండి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా పెరుగుతున్నారు. తెలుగులో మేం ఊహించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుత పరిస్థితులలో దేశభక్తి కంటే మానవత్వం గొప్పదనే ఆలోచననే ఈ సినిమా కథకు స్ఫూర్తి. దీనిని వినోదాత్మకంగా చెప్పాలని అనుకున్నాం. ఇందులో వార్ సీన్ అన్ రియల్ ఇంజన్- వర్చువల్ రియాలిటీలో అనే కొత్త టెక్నాలజీలో చేశాం. సత్యరాజ్‌తో పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. తన పాత్రని చాలా అద్భుతంగా చేశారు.అలాగే కథానాయిక మారియా చాలా చక్కగా నటించింది. అలాగే తమన్ లాంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్‌తో, మనోజ్ పరమహంస లాంటి టాప్ డీవోపీతో పని చేయడం కూడా గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఈ దీపావళికి ఒకేసారి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. నాలుగు సినిమాలు వచ్చినపుడు ఈ సినిమాపై కచ్చితంగా ప్రభావం ఉంటుంది. అయితే దేనికదే ప్రత్యేకం. ప్రిన్స్ హిలేరియస్ ఎంటర్ టైనర్. పండక్కి సరైన సినిమా. నిర్మాతలు డి.సురేష్ బాబు, సునీల్ నారంగ్ చాలా స్వేచ్ఛ ఇచ్చారు. ఎక్కడా రాజీ పడకుండా సినిమా చేయమని ప్రోత్సహించారు' అని తెలిపారు.