Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అభిమానులకు మాత్రమే కాదు ప్రేక్షకులకు, ఆయనతో పని చేసిన నటీనటులుకు, దర్శకులకు, నిర్మాతలకు.. అందరికీ ప్రభాస్ డార్లింగే. పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగినప్పటికీ ఎటువంటి గర్వం లేకుండా ఆయన కూడా అందర్నీ డార్లింగ్ అనే పిలిచే ప్రభాస్ పుట్టినరోజు నేడు (ఆదివారం).
భారీ విజయాలు సాధించినా, కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదిగినా, కీర్తి ప్రతిష్టలు ఖండాంతరాలు దాటినా ప్రభాస్ ఎప్పటికీ ప్రభాస్‌గా ఉండటం చాలా అరుదైన విషయమని ఆయనతో పనిచేసిన ప్రతి ఒక్కరూ ప్రశంసాపూర్వంగా చెప్పే మాటలవి.
తండ్రి, నిర్మాత సూర్య నారాయణరాజు, పెదనాన్న కృష్ణం రాజు వారసుడిగా 'ఈశ్వర్' సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టి 'వర్షం, ఛత్రపతి, బిల్లా, డార్లింగ్ ,మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, బాహుబలి, సాహో, రాధేశ్యామ్' లాంటి భారీ విజయాలను ప్రభాస్ సాధించారు.
గత రెండు దశాబ్దాలుగా ఓ నటుడిఆ తనని తాను ఎప్పటికప్పుడు కొత్తగా మలుచుకుంటూ, రెబెల్ స్టార్ నుండి పాన్ ఇండియన్ స్టార్ స్థాయిని దాటి అంతర్జాతీయ అభిమానుల మనసులను గెలుచుకున్నారు. 20 ఏళ్ళ పాటు ప్రేక్షకుల హృదయాల్లో మకుటం లేని మహారాజులా, దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే స్థాయికి వచ్చినా కూడా ఏ మాత్రం గర్వం లేకుండా తన సహ నటీనటులతో, మిగతా బృందంతో ఆప్యాయంగా 'డార్లింగ్' అని పిలుస్తూ, పిలిపించుకుంటూ ఉంటారు ప్రభాస్. ఎలాంటి కాంట్రవర్సీల జోలికి పోకుండా తనతో పని చేసిన దిగ్గజ నిర్మాతలు, దర్శకులు మళ్ళీ మళ్ళీ తనతో పని చేయాలనిపిస్తుంది అని చెప్తున్నారంటే నటుడిగా కాదు వ్యక్తిగా కూడా ప్రభాస్ వ్యక్తిత్వం ఎలాంటిదో వేరే చెప్పక్కర్లేదు. ప్రస్తుతం దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'ఆదిపురుష్' చిత్రంలోను, అలాగే 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో డార్క్ సెంట్రిక్ థీం టెక్నాలజీని వాడుతూ తెరకెక్కుతున్న ఇండియాలో మొట్ట మొదటి భారీ చిత్రం 'సలార్'లోను, వైజయంతి మూవీస్ లాంటి ప్రఖ్యాత బ్యానర్‌పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో, భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న 'ప్రాజెక్ట్ కె' చిత్రంలోనూ నటిస్తున్నారు. వీటితోపాటు 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, దర్శకుడు మారుతితో కూడా భారీ చిత్రాలు త్వరలో ప్రారంభం కానున్నాయి.