Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఓరి దేవుడా'. పి.వి.పి బ్యానర్‌పై ప్రసాద్ వి.పొట్లూరి నిర్మాతగా అశ్వత్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అగ్రకథానాయకుడు వెంకటేష్ ఇందులో దేవుడు పాత్రలో నటించారు. ఈ సినిమాను దీపావళి సందర్భంగా ఈ నెల21న విడుదల చేశారు. సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ, ''ఓరి దేవుడా' మూవీ మిమ్మల్ని టచ్ చేస్తుంది. ఫ్యామిలీతో కలిసి సినిమాను చూసి ఎంజారు చేయవచ్చు. ఫెస్టివల్ మూవీ. వెంకటేష్ మాతో పాటు ఉన్నారు. ఆయకు స్పెషల్ థ్యాంక్స్. ఎంటర్టైనింగ్ మూవీ. ప్రేక్షకులే కాదు.. విమర్శకులకు కూడా సినిమా బాగా నచ్చింది. రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని వండర్స్ చేస్తుందని భావిస్తున్నాను' అని తెలిపారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వంశీ కాక మాట్లాడుతూ, 'ఎవడి లైఫ్‌కి వాడే హీరో. నా హీరో విశ్వక్ సేన్. 'ఓరి దేవుడా' ప్లెజెంట్ లవ్ స్టోరి. సినిమా చూసిన అందరూ ఎంజారు చేస్తారు. పివిపి ఈ సినిమా కోసం రెండేళ్ల పైగానే ట్రావెల్ అయ్యారు. మా కోసం రాజమండ్రి వచ్చి ఈవెంట్‌ను సక్సెస్ చేసిన రామ్ చరణ్‌కి ఈ సందర్భంగా స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నాను. అలాగే సినిమాలో స్పెషల్ రోల్ చేసిన వెంకటేష్‌కి థ్యాంక్యూ వెరీ మచ్' అని చెప్పారు.
డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు మాట్లాడుతూ, 'తొలిరోజున థియేటర్స్‌లో తొలి షోను చూడటం, దానికి వచ్చిన రెస్పాన్స్ చూసి ఆశ్చర్యపోయాను. విడుదలైన అన్ని చోట్ల యూత్ ప్రేక్షకులే కాదు.. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా సినిమాను ఆదరిస్తున్నారు. తమిళంలోనే కాదు.. తెలుగులోనూ వస్తున్న రెస్పాన్స్ చూసి నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తున్నారు.