Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎస్.ఎం.ఎల్ ప్రొడక్షన్ సమర్పణలో హేమంత్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం 'రుద్రప్ప'. చిరంజీవి వీరాభిమాని రమేష్ ఈ చిత్రంతో కథానాయకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రానికి డీఓపి, ఆర్ట్ డైరెక్టర్‌గా సుధీర్ పి.ఆర్ వ్యవహరిస్తున్నారు. భరత్ సంగీతం సమకూరుస్తుండగా, సహదర్శకుడుగా భరత్ ప్రమోద్, సౌండ్ డిజైనర్‌గా హులివన్ నాగరాజ్ పనిచేస్తున్నారు.
పూర్తి విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఫ్యామిలీ డ్రామాతో పాటు ఎమోషన్ సెంటిమెంటల్ మూవీగా తెరకెక్కుతున్న 'రుద్రప్ప' ఒక వైవిధ్యమైన కథాంశంతో ప్రయోగాత్మకమైన చిత్రంగా తెరకెక్కుతోంది.
తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ ఎంతో కొత్తదనంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'అమ్మ నేను ఏ తప్పు చేయలేదు' అని హీరో క్యారెక్టర్ అంటుంటే, 'నువ్వు చేసిన తప్పుకు శిక్ష పడేదాకా చావద్దు' అని తల్లి క్యారెక్టర్ చెప్పడం చూస్తుంటే ఈ సినిమా కథాంశం ఎంత వినూత్నంగా ఉందో వేరే చెప్పక్కర్లేదు. 'ఈ సినిమా ఇంకా కొన్ని వారాల్లో రెగ్యులర్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. అతి త్వరలోనే సినిమాను పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ప్రయోగాత్మకమైన కొత్త కథలను ఎప్పుడూ స్వాగతించే ప్రేక్షకులు రుద్రప్ప సినిమాని స్వాగతించి, మంచి విజయం అందిస్తారన్న నమ్మకంతో ఉన్నాం' అని మేకర్స్ చెప్పారు.