Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకుడు మారుతి సారథ్యంలో రూపొందిన 'భద్రం బి కేర్ ఫుల్ బ్రదరు'తో తెరంగేట్రం చేసిన కథానాయకుడు రాజ్ దాసిరెడ్డి. ఈ ఏడాది హాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీని కోసమై అమెరికాలో వివిధ విభాగాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. అలాగే ఓ హై ప్రొఫైల్ టాలెంట్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకుని, పకడ్బందీగా అడుగులు వేస్తున్నారు. నేడు (సోమవారం) తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్న రాజ్ దాసిరెడ్డి తెలుగులోనూ ఓ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీపావళికి తన పుట్టినరోజు నేపథ్యంలో అటు హాలీవుడ్లోను, ఇటు టాలీవుడ్లో తనకి వస్తున్న అవకాశాల గురించి మీడియాతో రాజ్ దాసిరెడ్డి షేర్ చేశారు.