Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకుడు మేర్లపాక గాంధీ, హీరో సంతోష్ శోభన్ల తాజా చిత్రం 'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్'. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్టైన్మెంట్తో కలిసి ఆముక్త క్రియేషన్స్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను నవంబర్ 4న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఈ సందర్భంగా హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ, ' ప్రభాస్ ఈనెల 25న ట్రైలర్‌ని విడుదల చేస్తున్నారు. దర్శకుడు మేర్లపాక గాంధీ ఇచ్చిన కథతో 'ఎక్ మినీ కథ' చేశాను. అది మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే నటించడం అనందంగా ఉంది. మా నిర్మాత వెంకట్ బోయనపల్లికి కృతజ్ఞతలు' అని తెలిపారు. 'ఇదొక ఫన్ రైడ్ లాంటి సినిమా. మంచి అడ్వంచరస్, థ్రిల్ ట్రిప్‌లా ఉంటుంది. ఈనెల 29న ప్రీరిలీజ్ వేడుక చేయబోతున్నాం. మాపై నమ్మకంతో కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన నిర్మాతకి కృతజ్ఞతలు. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా ఈ చిత్రంలో ట్రావెల్ వ్లోగ్గేర్ గా కనిపిస్తారు. ఈ చిత్రంలో సెకండ్ లీడ్‌గా చాలా కీలకమైన పాత్ర ఉంది. ఈ పాత్రలో బ్రహ్మజీని తప్ప మరొకరిని ఊహించలేను' అని దర్శకుడు మేర్లపాక గాంధీ అన్నారు. నాయిక ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ, 'ఇది నాకు చాలా స్పెషల్ మూవీ. ఈ సినిమా రిలీజ్ కోసం చాలా ఎగ్జైటింగా ఉన్నాను' అని తెలిపారు. నిర్మాత వెంకట్ బోయనపల్లి మాట్లాడుతూ, 'సినిమా అద్భుతంగా వచ్చింది. దర్శకుడు మేర్లపాక గాంధీ చాలా గొప్పగా తీశారు. ప్రేక్షకులకు తప్పకుండా వినోదం పంచే సినిమా ఇది' అని అన్నారు.