Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయీభవ ఆర్ట్స్ పతాకం పై నందు విజరుకృష్ణ హీరోగా, యాంకర్ రష్మి గౌతమ్ హీరోయిన్గా రూపొందుతున్న చిత్రం 'బొమ్మ బ్లాక్‌బస్టర్'. రాజ్ విరాట్‌ను దర్శకుడుగా పరిచయం చేస్తూ ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మిస్తున్న చిత్రమిది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, విడుదలకు సిద్దమైన సందర్బంగా దర్శకుడు మారుతి, హీరో సిద్దు జొన్నలగడ్డ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ,'సినిమా చూశాను చాలా బాగుంది. సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులు మాత్రం కచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. అందుకే విరాట్‌కు మా బ్యానర్లో సినిమా చేయమని చెప్పాను' అని అన్నారు. 'మంచి కథను సెలెక్ట్ చేసుకుని 'బొమ్మ బ్లాక్ బస్టర్' టైటిల్‌తో తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను' అని నిర్మాత ఎస్కేయన్ తెలిపారు. హీరో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ, 'డైరెక్టర్ విరాట్ ఇంతకుముందు తీసిన షార్ట్ ఫిలిమ్‌కి బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు తీసుకున్నాడు. అలాగే ఈ సినిమా కంటెంట్‌లో ఏదో చాలా క్రేజీనెస్ ఉంది. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి' అని చెప్పారు.
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, 'ఈ సినిమా ఇంత బాగా వచ్చిందంటే దానికి ప్రధాన కారణం నందు, రష్మిక, డైరెక్టర్, ఆర్టిస్టులు ఇలా అందరూ ఫుల్ సపోర్ట్ చేశారు. దర్శకుడు విరాట్ మేకింగ్ చాలా బాగుంది. ప్రశాంత్ మేం అనుకున్న దాని కంటే 100 రెట్లు మంచి మ్యూజిక్ ఇచ్చాడు' అని తెలిపారు. దర్శకుడు రాజ్ కిరీటి మాట్లాడుతూ,' ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా పాటలకు, టీజర్‌కు అటు ఆడియెన్స్‌లో, ఇటు ఇండిస్టీ వర్గాల్లో అనూహ్య స్పందన వచ్చింది' అని అన్నారు.
'నన్ను నమ్మి రష్మీ ఈ సినిమా చేశారు. తనకు ఒక్క థ్యాంక్స్ చెపితే సరిపోదు. ఈ సినిమాతో పాటు పాటలు కూడా చాలా బాగా వచ్చాయి' అని హీరో నందు చెప్పారు. హీరోయిన్ రష్మిక గౌతమ్ మాట్లాడుతూ, 'విరాట్ నన్ను నమ్మి ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ సినిమా మా అందరికీ మంచి పేరు తీసుకు వస్తుంది' అని చెప్పారు.