Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎస్ఎస్ క్రియేషన్స్ నిర్మాణంలో జగదీష్ దూగాన దర్శకత్వంలో రాబోతున్న చిత్రం 'మరో మహాభారతం'. ఎమ్ఎస్ రెడ్డి సమర్పిస్తున్నారు. శియా గౌతమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ లేడి ఒరియంటెడ్ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
హీరో ఆకాష్ పూరి ఈ సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసి, క్లాప్ కొట్టారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు జగదీష్ దూగాన మాట్లాడుతూ, ''ప్రతి గంటకు నేల రాలే చిగురాకుల కలలెక్కడీ, ప్రతి కంటికి నేల జారే కన్నీటికి కళలెక్కడీ, లయ తప్పని విలయమైనా... ప్రళయమైనా ... లోక రక్షణే కదా. ఇది మరల రాయని భారతమైనా, మరో మహా భారతమే కదా. ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు రీచ్ అవుతుంది. శియా గౌతమ్ ఈ కథకు కరెక్ట్‌గా సెట్ అవుతారని ఆమెను ఎంపిక చేశాం' అని తెలిపారు. హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ, ''మరో మహాభారతం' టైటిల్ బాగుంది. మంచి కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమా విజయం సాధించి, డైరెక్టర్ జగదీష్ దూగానకి ఇది మంచి సినిమాగా నిలవాలి' అని అన్నారు.