Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బెల్ బాటమ్' ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'బనారస్'తో కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్‌ఖాన్ సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.
నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా ఈ సినిమా విడుదల కానుంది. 'నాంది' సతీష్ వర్మ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. 'ఇప్పటికే విడుదలైన 'బనారస్' ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి 'తొలి తొలి వలపే' వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. లవ్లీ రొమాంటిక్ ట్రాక్‌గా ఈ పాట వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సంగీత దర్శకుడు జనీష్ లోక్‌నాథ్ ప్లజంట్ మెలోడి ట్యూన్‌తో కంపోజ్ చేసిన ఈ పాట మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా శ్రావ్యంగా ఉంది. పాటలో జైద్ ఖాన్, సోనాల్ మోంటెరో కెమిస్ట్రీ బ్యూటీఫుల్‌గా ఉంది. గాయకులు కార్తీక్, కెఎస్ చిత్ర ఈ పాటని పాడిన తీరు అద్భుతం. కృష్ణకాంత్, భాస్కరభట్ల అందించిన సాహిత్యం మరింత ఆకర్షణగా నిలిచింది' అని చిత్ర బృందం తెలిపింది. సుజరు శాస్త్రి, దేవరాజ్, అచ్యుత్ కుమార్, సప్నా రాజ్, బర్కత్ అలీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్, డీవోపీ: అద్వైత గురుమూర్తి, యాక్షన్: ఎ వుయి, డిఫరెంట్ డానీ, డైలాగ్స్: రఘు నిడువల్లి, ఎడిటర్: కె ఎం ప్రకాష్, ఆర్ట్: అరుణ్ సాగర్, శ్రీను, కొరియోగ్రాఫర్: జయతీర్థ, ఎ.హర్ష, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.బి.రెడ్డి.