Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విలేజ్ బ్యాక్ డ్రాప్లో ప్రేక్షకులకు ఓ వినూత్న అనుభూతి కలిగించేలా 'ఉమాపతి' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఫీల్ గుడ్ లవ్‌స్టోరీని కామెడీకి పెద్ద పీట వేస్తూ ఎంతో వినోదాత్మకంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన 'కలవాని' సినిమాను తెలుగులో 'ఉమాపతి' అనే టైటిల్‌తో తెెరకెక్కిస్తున్నారు. క్రిషి క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాలో అనురాగ్ హీరోగా నటిస్తుండగా, అవికా గోర్ హీరోయిన్గా నటిస్తోంది.
సత్య ద్వారపూడి దర్శకత్వంలో ఈ సినిమాకు కె.కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. 'ఫిదా' మూవీకి సంగీతం అందించిన శక్తికాంత్ కార్తిక్ బాణీలు కడుతున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను మేకర్స్ శరవేగంగా జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి కానుకగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో హీరో, హీరోయిన్ల లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. పోసాని కృష్ణమురళి, తులసి, ప్రవీణ్, జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్, త్రినాథ్, శ్రీమన్నారాయణ, భద్రం, శ్రీనివాస్, జయవాణి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
తెలుగు నేటివిటీకి తగ్గ లొకేషన్స్ ఎంచుకొని ఈ సినిమాను చిత్రీకరించారని, ఈ మూవీలోని అవుట్ అండ్ అవుట్ కామెడీ ట్రాక్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని, అన్ని వర్గాల ఆడియన్స్ ఈ మూవీ చూసి ఎంజారు చేయడం పక్కా అని, ముఖ్యంగా నాయకానాయికలు అనురాగ్, అవికాగోర్ల నటన ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుందని దర్శక,నిర్మాతలు అంటున్నారు. అతిత్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ని అధికారికంగా ఎనౌన్స్ చేయనున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం: సత్య ద్వారపూడి, నిర్మాత: కె.కోటేశ్వరరావు, సంగీతం: శక్తికాంత్ కార్తిక్, ఎడిటింగ్: గౌతమ్ రాజు, కెమెరా : రాఘవేంద్ర.