Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్'. ఈ సినిమా నవంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను అగ్ర కథానాయకుడు ప్రభాస్ లాంచ్ చేశారు.హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ,'ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఫరియా అబ్దుల్లాని ఈ సినిమాలో చూసి అందరూ సర్ ప్రైజ్ అవుతారు. బ్రహ్మజీ పాత్ర ఇందులో అవుట్ స్టాండింగ్‌గా ఉంటుంది' అని తెలిపారు. 'ఇది కంప్లీట్‌గా ఫన్ మూవీ. నాన్ స్టాప్ నవ్వులు ఉంటాయి. సంతోష్ శోభన్‌తో 'ఎక్ మినీ కథ' చేశాం. ఇందులో తన పాత్రని పెర్ఫెక్ట్గా చేశాడు' అని దర్శకుడు మేర్లపాక గాంధీ చెప్పారు. నాయిక ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ, 'చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాం. ప్రేక్షకులు కూడా ఎంజారు చేస్తారనే నమ్మకం ఉంది' అని చెప్పారు. సినిమా అద్భుతంగా ఉంది. మేర్లపాక గాంధీ అద్భుతంగా డైరెక్ట్ చేశారు. సినిమాలో పని చేసిన అందరికీ మంచి పేరు వస్తుంది. మా నిర్మాత ఎంతో నమ్మకంగా సినిమా నిర్మించారు' అని బ్రహ్మాజీ అన్నారు.