Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన 'డీజే టిల్లు' ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. 'డీజే టిల్లు' సీక్వెల్‌కి 'టిల్లు స్క్వేర్' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా అధికారికంగా ప్రకటించారు.
సీక్వెల్లో సిద్ధుకి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. 'టిల్లు స్క్వేర్' చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభమైంది. 'డీజే టిల్లు' సంచలనం సృష్టించిన ఏడాదికే 2023 మార్చిలో సీక్వెల్ థియేటర్లలో సందడి చేయనుంది.
'టిల్లు స్క్వేర్' చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ దీపావళి కానుకగా ఒక ప్రత్యేక వీడిమోని చిత్ర బృందం విడుదల చేసింది. 'డీజే టిల్లు' టైటిల్ సాంగ్‌ని స్వరపరిచి విశేషంగా ఆకట్టుకున్న రామ్ మిరియాల ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా సాయి ప్రకాష్, ఎడిటర్‌గా నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్‌గా ఏఎస్ ప్రకాష్ వ్యవహరిస్తున్నారు.