Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'వారసుడు'. తమిళంలో 'వారిసుని'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రమిది. ఈ చిత్రం చివరి షెడ్యూల్ మినహా దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. వచ్చే నెల నుంచి సినిమా ప్రమోషన్స్ ప్రారంభం కానున్నాయి.
దీపావళి సందర్భంగా 2023 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా సంక్రాంతి అతిపెద్ద పండుగ కావడంతో మేకర్స్ పండుగ సీజన్‌ను సద్వినియోగం చేసుకోవడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఎనౌన్స్మెంట్ పోస్టర్లో యాక్షన్ మోడ్‌లో ఉన్న విజయ్ లుక్ అందర్నీ అలరిస్తోంది. క్లాసియెస్ట్ బెస్ట్ లుక్‌లో విజరుని ప్రజంట్ చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్, సెకండ్ లుక్ పోస్టర్లకు భారీ స్పందన వచ్చింది. టైటిల్, పోస్టర్లు భారీ అంచనాలను నెలకొల్పాయి. ఈ చిత్రంలో రష్మిక మందన్న నాయిక.
ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే: వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సాల్మన్, సహ నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత, సంగీతం: ఎస్ తమన్, డీవోపీ: కార్తీక్ పళని, ఎడిటింగ్: కెఎల్ ప్రవీణ్.