Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జస్వంత్ పడాల (జెస్సీ), నక్షత్ర త్రినయని జంటగా నూతన దర్శకుడు సాందీప్ మైత్రేయ. ఎన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఎర్రర్ 500'. మైత్రేయ మోషన్ పిక్చర్స్ పతాకంపై యు.బాలరెడ్డి (ఇన్ఫోసిటీ బిల్డర్స్) నిర్మిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'తెలుగు చిత్ర పరిశ్రమలోకి యువత రావాల్సిన అవసరం వుంది. యువతని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తున్నారు. ఈ చిత్ర యూనిట్ చాలా ప్యాషన్ ఈ సినిమా చేశారు. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి' అని అన్నారు.
జస్వంత్ మాట్లాడుతూ,'అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. సినిమా చాలా బాగా వచ్చింది. నన్ను హీరోగా పరిచయం చేసిన మైత్రేయ మోషన్ పిక్చర్స్‌కి కతజ్ఞతలు. ఈ సినిమాతో నటుడిగా నాకు మంచి గుర్తింపు లభిస్తుందనే నమ్మకంతో ఉన్నాను. అలాగే మరిన్ని అవకాశాలూ వస్తాయని ఆశిస్తున్నాను. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కచ్చితంగా ఈ సినిమా అలరిస్తుంది' అని చెప్పారు. దర్శకుడు సాందీప్ మాట్లాడుతూ, 'దర్శకుడిగా నా తొలి చిత్రమిది. మంత్రి తలసాని టీజర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇదొక మంచి ఎంటర్ టైనర్. 'బిగ్ బాస్' ఫేమ్ జస్వంత్‌ని మేం హీరోగా లాంచ్ చేస్తున్నాం. ఆయన నటన అద్భుతం. మేకింగ్‌లో మా నిర్మాత బాలరెడ్డి ఎక్కడా రాజీపడలేదు' అని తెలిపారు.
త్రినాధ్ వర్మ, రాజీవ్ కనకాల, సంజయ్ స్వరూప్, రోహిణి హట్టంగడి, మొహమ్మద్ సమద్, ప్రమోదిని, నామిన తారా, బేబీ సియా, స్వాతి, బబ్లూ మాయ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం శ సాందీప్ మైత్రేయ ఎన్, నిర్మాత : యు.బాలరెడ్డి (ఇన్ఫోసిటీ బిల్డర్స్), సినిమాటోగ్రఫీ : శశాంక్ శ్రీరామ్, ప్రశాంత్ మన్నె, సంగీతం : ఫణి కళ్యాణ్, ఎడిటర్ : గ్యారీ బిహెచ్, డైలాగ్స్ : రాకేందు మౌళి, సాందీప్ మైత్రేయ ఎన్, యాక్షన్ : రబిన్ సుబ్బు, కొరియోగ్రఫీ : సాందీప్ మైత్రేయ ఎన్, ఆర్ట్ డైరెక్టర్ : నాని, రత్నవాస్.