Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవలే 'కార్తికేయ2' సినిమాతో హిట్ అందుకున్నారు హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఆ సినిమాలో ఆయనకి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించారు. వీళ్ళిద్దరూ మరోసారి '18 పేజీస్' సినిమా కోసం జతకట్టారు. ఈ నాస్టాల్జిక్ రొమాన్స్‌ని దర్శకుడు సుకుమార్ రాశారు. ఇదే కాకుండా గతంలో 'కుమారి 21 ఎఫ్' చిత్రానికి కూడా ఆయన కథ అందించారు. ఆయన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి జీఎ2 పిక్చర్స్‌పై బన్నీ వాస్ నిర్మించారు.
'ప్రస్తుతం ఈ సినిమా తుది దశకు చేరుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ ఇటీవల ప్రారంభమైంది. చిత్రీకరణ కూడా అద్భుతంగా కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సినిమాటోగ్రాఫర్ ఎ వసంత్ విజువల్స్ సినిమా ఫీల్ గుడ్ వైబ్‌ని పెంచాయి. అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. సుకుమార్ కథ అందించడం, రీసెంట్గా 'కార్తికేయ 2' చిత్రంతో నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ల జంట బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సినిమాగానే కాకుండా జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌కి మరో సూపర్‌హిట్ సినిమా అవుతుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు' అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈచిత్రానికి స్క్రీన్ ప్లే - దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్, కథ: సుకుమార్, నిర్మాత: బన్నీ వాస్, సంగీతం: గోపీ సుందర్, సినిమాటోగ్రఫీ: వసంత్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్: రమణ వంక, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శరణ్ రాపర్తి (గీతా ఆర్ట్స్), రచయిత: శ్రీకాంత్ విస్సా, లైన్ ప్రొడ్యూసర్: బాబు.