Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్గానిక్ మామ - హైబ్రిడ్ అల్లుడు'. రాజేంద్రప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో కె.అచ్చిరెడ్డి సమర్పణలో అమ్ము క్రియేషన్స్, కల్పన చిత్ర పతాకంపై కోనేరు కల్పన నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రంలో బిగ్‌బాస్ ఫేం సోహెల్, మృణాళిని జంటగా నటిస్తున్నారు. తన చిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం వహించే కృష్ణారెడ్డి ఈ చిత్రానికి మాటలు కూడా రాయడం మరో విశేషం. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర టీజర్, ట్రైలర్ లాంచ్ వేడుక ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శకుడు శేఖర్ కమ్ముల విచ్చేసి ట్రైలర్, టీజర్లను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'కృష్ణారెడ్డి సినిమాలు అంటే ఒక రిలీఫ్. అన్ని వర్గాలకు కావాల్సిన అన్ని అంశాలనూ చక్కగా ఏర్చి, కూర్చి అద్భుతమైన సంగీతంతో మనకు అందిస్తారు. ఆయన సినిమాలు కమర్షియల్ హంగులతో ఉంటూనే పిల్లలకు కూడా ఫేవరెట్‌గా ఉంటాయి. ట్రైలర్ చూసిన తర్వాత కృష్ణారెడ్డికి కమ్‌బ్యాక్ అని గట్టిగా చెప్పవచ్చు' అని తెలిపారు.
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, 'ఈ సినిమా నిర్మాత కల్పన డెడికేషన్, ప్లానింగ్ చూసిన తర్వాత ఈ ప్రొడక్షన్ హౌస్ నా కెరీర్లో ది బెస్ట్ అని చెపుతున్నాను. అచ్చిరెడ్డి ఇచ్చిన ధైర్యంతోనే దర్శకుడిని అయ్యా.. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే ఇప్పుడు ఈ సినిమాకు మాటలు కూడా రాశాను. ఇంతమంది మంచి మనుషులు నా చుట్టూ ఉంటే నా నుంచి ఒక పెద్ద హిట్ ఎందుకు రాకుండా ఉంటుంది' అని తెలిపారు. 'కృష్ణారెడ్డితో సినిమా చేయాలని కల్పన చాలాసార్లు అన్నారు. ఈ కథ వినగానే ఆమెకు బాగా నచ్చి, సి. కల్యాణ్‌కి చెప్పారు. నీకు నచ్చితే ఓకే అని ఆయన గ్రీన్ సిగల్ ఇవ్వడంతో ఇక ఆమె మమ్మల్ని జెట్ స్పీడ్‌లో పరుగెత్తించారు. ప్రస్తుత జనరేషన్‌కు ఇది పర్ఫెక్ట్ సినిమా. కృష్ణారెడ్డి మార్క్ ఇది. త్వరలోనే ఆడియోను సరిగమ మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తాం' అని సమర్పకుడు, నిర్మాత కె.అచ్చిరెడ్డి చెప్పారు.
హీరో సోహెల్ మాట్లాడుతూ, 'కృష్ణారెడ్డి దర్వకత్వంలో నటించడం అంటే ఇప్పటికీ నమ్మలేని విషయంగానే అనిపిస్తుంది. బిగ్‌బాస్ వల్ల నేను చాలా మందికి పరిచయం అయ్యాను. ఇప్పుడు కృష్ణారెడ్డి సినిమా ద్వారా ప్రతి కుటుంబానికి చేరువ అవుతాననే నమ్మకం ఉంది' అని తెలిపారు.