Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీరామ్, ఎల్సా, శుభశ్రీహొహీరో, హీరోయిన్లుగా మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'రుద్రవీణ'. రాగుల గౌరమ్మ సమర్పణలో సాయి విల సినిమాస్ పతాకంపై రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీను సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా నేడు (శుక్రవారం) గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా నిర్మాత రాగుల లక్ష్మణ్ మాట్లాడుతూ, 'ఎల్సా, శుభశ్రీ, అలాగే మరో నటి సోనియా లేడీ విలన్‌గా చక్కగా నటించింది. రఘు కుంచె విలన్‌గా అద్భుతమైన నటనను కనపరచ్చారు. హీరో శ్రీరామ్‌కు ఈ సినిమాతో మంచి పేరు వస్తుంది. ఈ సినిమా కథ చాలా కొత్తగా, మనం ఎప్పుడూ చూడని కథను చూస్తారు. ఇందులోని పాటలు అన్నీ ఆణిముత్యాల్లాగా అద్భుతంగా వచ్చాయి. మనకు జరిగే ప్రతి ఫెస్టివల్లో ఈ సాంగ్స్ ప్లే అయ్యేలా ఉంటాయి' అని తెలిపారు.
'మా అమ్మ నిర్మాణంలో మేం ఈ సినిమా తీశాం.. చిన్నప్పట్నుంచి మేం చిరంజీవికి బిగ్ ఫ్యాన్స్. అందుకే మేం తీసిన ఈ సినిమాకు ఆయన సూపర్ హిట్ సినిమా 'రుద్ర వీణ' టైటిల్ పెట్టాం' అని మరో నిర్మాత రాగుల శ్రీను అన్నారు. రఘు కుంచె మాట్లాడుతూ, 'విలన్ క్యారెక్టర్ చేస్తున్న నా ముఖానికి గాటు ఉండేలా డిఫరెంట్ లుక్ డిజైన్ చేశారు. లవ్, రొమాన్స్, ఫైట్స్, ఎమోషన్స్ ఇలా అన్ని రకాలతో ఫుల్ ప్యాకేజ్డ్గా వస్తున్న ఈ చిత్రం గొప్పవిజయం సాధించాలి' అన్నారు.'ఈ సినిమా కంటెంట్ చాలా బాగుంటుంది. నేడు (శుక్రవారం) రిలీజ్ అవుతున్న మా చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను' అని దర్శకుడు మధుసూదన్ రెడ్డి చెప్పారు. హీరో శ్రీ రామ్ నిమ్మల మాట్లాడుతూ,'ఈ టైటిల్ పెట్టుకోవడానికి చాన్స్ ఇచ్చిన చిరంజీవికి కృతజ్ఞతలు. ఓ మంచి కాన్సెప్ట్‌తో, కంటెంట్‌తో వస్తున్న ఈచిత్రంలో మంచి పాత్ర పోషించినందుకు చాలా హ్యాపీగా ఉంది' అని చెప్పారు.