Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తన తదుపరి చిత్రానికి సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ఈ అప్డేట్ గురంచి ఆయన మాట్లాడుతూ, ''వ్యూహం'అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను . ఇది బయోపిక్ కాదు, బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయో పిక్‌లో అయినా అబద్దాలు ఉండొచ్చు. కానీ ఈ రియల్ పిక్‌లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయి. అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన 'వ్యూహం' కథ, రాజకీయ కుట్రల విషంతో నిండి ఉంటుంది. రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే ఈ చిత్రం. ఈ చిత్రం రెండు పార్ట్స్‌గా రాబోతుంది. మొదటి పార్ట్ 'వ్యూహం'. రెండవ పార్ట్ 'శపథం'. రెండింటిలోనూ రాజకీయ ఆరాచకీయాలు పుష్కలంగా ఉంటాయి. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం 'వ్యూహం' షాక్ నుంచి తెరుకునే లోపే వాళ్ళకి ఇంకో ఎలక్ట్రిక్ షాక్ పార్ట్ 2 'శపథం'తో తగులుతుంది. ఈ చిత్రానికి నిర్మాత నాతో 'వంగవీటి' సినిమా తీసిన దాసరి కిరణ్. ఎలక్షన్స్ టార్గెట్‌గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు. కాబట్టి ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదు' అని అన్నారు.