Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సింగిల్ క్యారెక్టర్, డిఫరెంట్ స్టోరీ లైన్ తీసుకుని 'హలో మీరా' అంటూ ఓ కొత్త తరహా థ్రిల్లింగ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసు కొస్తున్నారు దర్శకుడు కాకర్ల శ్రీనివాసు. తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ చేతుల మీదుగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా హరీష్‌శంకర్ మాట్లాడుతూ, 'ఈ మూవీ ఎంతో ఆసక్తికరంగా ఉండటమే గాక వైవిధ్యభరితంగా ఉండనుందని ఈ టీజర్ ద్వారా తెలుస్తోంది. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాన్ని రూపొం దించిన చిత్ర బృందానికి విజయం లభించాలి' అని తెలిపారు. 'మీరా అనే సింగిల్ క్యారెక్టర్, ఆమెకు వచ్చే ఫోన్ కాల్స్, అందులోని ట్విస్టులు ఈ మూవీ కథపై ఇంట్రెస్ట్ నెలకొల్పాయి. పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి మీరాకి ఓ రాత్రి జరిగిన సంఘటనల సమాహారంగా ఆద్యంతం థ్రిల్ చేసేలా ఈ సినిమా ఉంటుంది' అని మేకర్స్ తెలిపారు. లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో రూపొందిస్తునన ఈ చిత్రంలో మీరాగా గార్గేయి యల్లాప్రగడ నటించారు. ప్రశాంత్ కొప్పినీడి అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన ఆకర్షణ కానుంది. ఈ చిత్రానికి నిర్మాతలు : డా: లక్ష్మణరావు దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల, సంగీతం : ఎస్.చిన్న, లైన్ ప్రొడ్యూసర్ : అనంత శ్రీధర్, మాటలు : హిరన్మయి కళ్యాణ్, ఎడిటర్ : రాంబాబు మేడికొండ.