Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం బ్లాక్ అండ్ వైట్. పద్మనాభ రెడ్డి, సందీప్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎస్ఆర్ ఆర్ట్స్, ఏ యూ అండ్ ఐ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ సహకారంతో ఎ. మేఘనా రెడ్డి సమర్పిస్తున్నారు.
ఎల్‌ఎన్‌వి సూర్య ప్రకాష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూర్య శ్రీనివాస్, లహరి శారి, నవీన్ నేని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను రచయిత, రాజ్యసభ సభ్యులు వి.విజయేంద్ర ప్రసాద్ విడుదల చేశారు. టీజర్‌ను లాంచ్ చేసిన ఆయన మూవీ సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించారు. చిత్ర టైటిల్‌కు తగ్గటే.. ట్రైలర్ కూడా ఆకట్టుకునేలా ఉంది. 'నో కమిట్మెంట్, నో కంట్రోల్, నో రిస్ట్రిక్షన్స్.. లెట్స్ సెలబ్రేట్ యువర్ ఫ్రీడమ్'అంటూ హెబ్బా చెప్పిన డైలాగ్స్ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. సూర్య శ్రీనివాస్‌తో సహా చాలా పాత్రలను టీజర్లో అనుమానాస్పద రీతిలో చూపించారు. లహరి, నవీన్ నేని పాత్రలను కూడా టీజర్లో చూపించారు. ఉత్కంఠభరితమైన ఈ టీజర్, థ్రిల్లర్ సినిమా ప్రేమికులను ఆకట్టుకునేలా ఉంది. ఇందులో యువతకు నచ్చే అంశాలు కూడా ఉన్నాయి. టీజర్ కట్‌తో దర్శకుడు సూర్య ప్రకాష్ ఆసక్తిని రేకెత్తించాడు. టీజర్లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. టి.సురేంద్ర రెడ్డి సినిమాటోగ్రఫీ హైలైట్ అవుతోంది. అజరు అరసాడ సంగీతం అందించారు. ఈచిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.
సురేష్ బాబు, కిషోర్ కుమార్, అమ్ములు ఆర్కే, వంశీ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి దర్శకుడు: ఎల్ఎన్వీ సూర్య ప్రకాష్, నిర్మాతలు: పద్మనాభ రెడ్డి, సందీప్ రెడ్డి, సమర్పణ: ఎ.మేఘనా రెడ్డి, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: అషీర్ లూక్, డి. సుమన్ జె, ఎడిటర్: శివ సర్వాణి, ఆర్ట్ డైరెక్టర్: వంశీ బోయిన, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మనోజ్ మావిళ్ల, గాయకులు: యాజిన్ నిజార్, లిప్సిక, చిన్మయి, సాహిత్యం: శ్రీమణి, కొరియోగ్రఫీ: కళాధర్, పోలాకి విజయ్.