Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్రకథానాయకుడు రజనీకాంత్ లేటెస్ట్గా ఒకేసారి రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లకు పచ్చజెండా ఊపారు. దీంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ రెండు భారీ ప్రాజెక్ట్‌ల గురించి తెలియజేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఓ వీడియోని విడుదల చేసింది. లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి రజనీకాంత్ ఈ రెండు సినిమాలు చేయనున్నారు. ఈ రెండు చిత్రాలను ఈ సంస్థ గ్రాండ్‌గా నిర్మించనుంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పూజా కార్యక్రమాలు చెన్నైలో నవంబర్ 5న నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా రజినీ కాంత్‌ను లైకా ప్రొడక్షన్స్ ఛైర్మన్ సుభాస్కరన్, వైస్ ఛైర్మన్ ప్రేమ్శివసామి, తమిళ కుమారన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ చిత్రాలకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని ప్రకటించారు. లైకా ప్రొడక్షన్స్ భారీ సినిమాలకు పెట్టింది పేరు. గతంలో శంకర్ దర్శకత్వం వహించిన సినిమా '2.0' ని ఈ సంస్థే నిర్మించింది. 'పొన్నియిన్ సెల్వన్'ను కూడా ఈ ప్రొడక్షన్ హౌసే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ప్రస్తుతం 'భారతీయుడు2' ను నిర్మిస్తోంది. ఇక రజనీకాంత్ ప్రస్తుతం 'జైలర్'లో నటిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, శివరాజ్ కుమార్, శివ కార్తికేయన్, తమన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు.