Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. నవంబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ మీడియాతోహొముచ్చటించారు.
ఆ విశేషాలు మీ కోసం..'సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. సరోగసీ ఫెసిలిటీ సెంటర్ హెడ్‌గా గ్రే షేడ్స్ ఉన్న రోల్ చేశా. నేను చాలా రిచ్. డబ్బులు అంటే ఇష్టం. తననుహొతాను బాగా ప్రేమించే పాత్ర. సమంత క్యారెక్టర్, నా క్యారెక్టర్ మధ్య ఉన్న రిలేషన్, మా కథలు చాలా ఆసక్తిగా ఉంటాయి.హొదర్శకులుహొహరి, హరీష్ ఒక్కోహొక్యారెక్టర్ కోసం చాలా రీసెర్చ్ చేశారు. మహిళలహొపాత్రలనుహొచాలా మంది రిలేట్హొచేసుకునేలా ఉంటాయి. టెక్నికల్‌గా సినిమాటోగ్రాఫర్ సుకుమార్ అద్భుతంగా
షూట్ చేశారు. మణిశర్మ మంచి సంగీతం అందించారు. మా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఎంతో ఖర్చుపెట్టి సెట్స్ వేశారు. ఆర్ట్ డైరెక్టర్ వర్క్ కనిపిస్తుంది. మీరు పెట్టే టికెట్ రేటుకుహొవేల్యూ ఉంటుంది. సినిమాలోహొఅంతహొమంచి కంటెంట్ ఉంది. ఈ కథలో సరోగసీ ఒక టాపిక్ అంతే. అందులో మంచి చెడుల గురించి చెప్పడంహొలేదు. కానీ, సమాజంలో అటువంటి మనుషులు ఉన్నారని అనిపిస్తుంది. 'యశోద'లో కథే హీరో. ప్రస్తుతం తెలుగులో 'శబరి' చేస్తున్నా. 'వీర సింహా రెడ్డి'లో నాది క్రేజీ క్యారెక్టర్. ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి.