Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గతంలో చిరంజీవి హీరోగా నటించి, విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం 'పసివాడి ప్రాణం'. అదే టైటిల్‌తో, వినూత్న టెక్నాలజీతో ధన్ శ్రీ ఆర్ట్స్ బ్యానర్ పై నూతన హీరో అల్లు వంశీ, ఇతి ఆచార్య జంటగా తెరకెక్కిస్తున్నారు. ఎన్ఎస్ మూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ నెలలో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మీడియాతో దర్శక, నిర్మాత ఎన్ఎస్ మూర్తి మాట్లాడుతూ, 'టాలీవుడ్లో ఇంతవరకు రానటువంటి వినూత్నమైన లైవ్ కమ్ యానిమేషన్ చిత్రం ఇది. మోషన్ కాప్చర్, యానిమేషన్, గ్రాఫిక్స్ టెక్నాలజీలతో నిర్మితమైన త్రీడీ డెడ్డీబేర్, 2డి బేబీ క్యారెక్టర్స్ మిగిలిన నటీనటులతో పోటీగా ప్రేక్షకులను మెప్పిస్తాయి. అప్పటి 'పసివాడి ప్రాణం' సినిమాలో పసివాడుగా నటించిన సుజిత ఇందులో తల్లిగా నటించారు. నేను మెగాస్టార్ ఫ్యాన్‌ని అందుకే అల్లు ఫ్యామిలీ నుంచి వంశీని హీరోగా పరిచయం చేశాను' అని తెలిపారు. హీరో అల్లు వంశీ మాట్లాడుతూ, 'నాకు ఈ సినిమాలో హీరోగా అవకాశం కల్పించిన నిర్మాత మూర్తికి రుణపడి ఉంటాను' అని చెప్పారు. 'తెలుగులో నాకిది మొదటి సినిమా. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది' అని హీరోయిన్ ఇతి ఆచార్య అన్నారు.