Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'భీమదేవరపల్లి బ్రాంచి' సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఏబీ సినిమాస్, నిహాల్ప్రొడక్షన్స్ పతాకాలపై తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ను దర్శకుడు వేణు శ్రీరామ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ప్రేక్షకులు ప్రస్తుతం ఇలాంటి రియలిస్టిక్ సినిమాలు ఇష్టపడుతున్నారు. దర్శకుడు రమేష్ చెప్పాల బలమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఇలాంటి కథాంశాన్ని కామెడీ వేలో చెప్పడం వల్ల జనాలకి ఈజీగా సినిమా రీచ్ అవుతుంది' అని అన్నారు.
'నియోలియలిజం ఉట్టిపడేలా 'స్లైస్ ఆఫ్ లైఫ్' జోనర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. చెప్పాలనుకున్న కథలో సహజత్వం పోకూడదని, అనేకమంది టాలెంటెడ్ థియేటర్ ఆర్టిస్టులతో ఈ సినిమా చేశాం. దీంతో సినిమా అత్యంత సహజంగా వచ్చింది. స్క్రీన్ ప్లే రెండు గంటలు ప్రేక్షకుణ్ణి కట్టిపడేస్తుందని' అని దర్శకుడు రమేష్ చెప్పాల తెలిపారు.
అంజి బాబు, రాజవ్వ, సుధాకర్ రెడ్డి, కీర్తి లత, అభి, రూప శ్రీనివాస్, శుభోదయం సుబ్బారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన-దర్శకత్వం: రమేశ్ చెప్పాల, నిర్మాతలు: బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లి, కెమెరా: కె.చిట్టి బాబు, సంగీతం: చరణ్ అర్జున్, సాహిత్యం:సుద్దాల అశోక్ తేజ, ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి, ఆర్ట్: మోహన్.