Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీట్ ఎడ్జ్ మూమెంట్స్‌తో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ 'తగ్గేదే లే'. భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది. నవీన్ చంద్ర లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రాన్ని 'దండుపాళ్యం' ఫేమ్ శ్రీనివాస రాజు తెరకెక్కించారు.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు శ్రీనివాసరాజు శనివారం మీడియాతో మాట్లాడుతూ,''ఇదొక మర్డర్ మిస్టరీ. కరోనా సమయంలో 'తగ్గేదేలే' అనే పదం ఎక్కువగా పాపులర్ అయింది. ఈ కథలో కూడా తగ్గేదేలే అన్నట్టుగా పాత్రలుంటాయి. అందుకే ఈ టైటిల్ పెట్టాం. అయితే ఈ టైటిల్ ఇంత వైరల్ అవుతుందని, ఇంత రెస్పాన్స్ వస్తుందని మేం అప్పుడు అనుకోలేదు. ఈ సినిమా నిడివి దాదాపు రెండు గంటల పదిహేను నిమిషాలుంటుంది. అందులో సగానికి పైగా లవ్ స్టోరీ ఉంటుంది. సినిమా మొత్తం అలా చూస్తుండిపోయేలా ఉంటుంది. మనిషి నమ్మకాన్ని స్వామిజీలు వాడుకుంటున్నారు. ఆధ్యాత్మికం వ్యాపారంగా మారింది. స్వామిజీ ముసుగులో జరిగే వాటిని ఇందులో చెప్పాం. అక్కడే ఎక్కువగా మనీలాండరింగ్ జరుగుతుంది. ఇందులో నాగబాబు చెప్పే ఆ సీన్ బాగుంటుంది. నవీన్ చంద్రకు కథ బాగా నచ్చింది. ఆయనది లవ్ స్టోరీ మాత్రమే. నా ప్రతీ సినిమాలో యాక్టర్స్ కంటిన్యూ అవుతూనే ఉంటారు. 'దండుపాళ్యం' మొదటి పార్ట్ కన్నడ సినిమానే. అది ఆ రోజుల్లోనే 36 కోట్లు కలెక్ట్ చేసింది. వంద రోజులు ఆడింది. 'కేజీయఫ్' రేంజ్లో కలెక్షన్లు వచ్చినట్టు. దండుపాళ్యం లాంటి హిట్ మళ్లీ ఇంత వరకు రాలేదు. నవంబర్ 4న వస్తున్న ఈ సినిమా అందర్నీ అలరిస్తుంది' అని తెలిపారు.