Authorization
Mon Jan 19, 2015 06:51 pm
24 మంది సినీ ప్రముఖుల జీవిత చరిత్రలను ఆవిష్కరిస్తూ జర్నలిస్ట్ ప్రభు రాసిన 'శూన్యం నుంచి శిఖరాగ్రాల వరకు' పుస్తకాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. దాసరి నారాయణరావు, కృష్ణ, కృష్ణంరాజు, విజయనిర్మల, వడ్డే రమేష్, కృష్ణవంశీ, పూరీ జగన్నాథ్, సి.కల్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ వంటి వారి జీవిత చరిత్రలకు ప్రభు ఈ పుస్తకంలో అక్షరరూపమిచ్చారు. చిరంజీవి ఆవిష్కరించిన తొలికాపీకి వేలంపాట నిర్వహించగా, రవి పనస రూ.4 లక్షలకు దక్కించుకోవడం విశేషం. జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ, 'నేను ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం మెగాస్టార్' అని తెలిపారు.
'ఎన్నో భాషలతో పోల్చుకుంటే తెలుగు సినిమా జర్నలిజంలో ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది. ఈ పుస్తకం రావడం అనేది ఇప్పుడు అవసరం. ఎందుకంటే నా ఇంట్లోనే నేను నా గురించి చెప్పుకోవాల్సి వస్తోంది. అలాంటిది మన ఇండిస్టీలో ఉన్న గొప్పవాళ్ల గురించి ఇప్పటి జనరేషన్‌కి తెలిసేలా ఈ పుస్తకం రాయాలని ప్రభు పూనుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను' చిరంజీవి అన్నారు.