Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, 'బెల్ బాటమ్' ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'బనారస్'తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. సోనాల్ మోంటెరో కథానాయిక. ఎన్‌కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా ఈ సినిమా విడుదల కానుంది. 'నాంది' సతీష్ వర్మ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో హీరో జైద్‌ఖాన్ మీడియాతో మాట్లాడుతూ, 'ఈ సినిమాని ఓ విజువల్ ట్రీట్‌లా తెరకెక్కించాం. ఈ కథలో ఒక మిస్ట్రీరియస్, డార్క్ ఎలిమెంట్ ఉంది. దానికి బనారస్ నేపథ్యం ఎంచుకున్నాం. కంటెంట్, బ్యాక్‌డ్రాప్ రెండూ ప్రేక్షకులని థ్రిల్ చేస్తాయి. అందరికీ ఈ సినిమా కొత్త అనుభూతిని ఇస్తుంది. సస్పెన్స్, కామెడీ, థ్రిల్ యాక్షన్ ఇలా.. అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇందులో ఒక ప్రయోగం కూడా చేశాం. అది ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే టైం ట్రావెల్ కూడా ఉంటుంది. అయితే అది కథలో కొంత భాగమే. ఇప్పటివరకూ సినిమా చూసిన వారంతా మంచి రివ్యూలు ఇచ్చారు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా బనారస్ వెళ్లానని అనుకుంటారు. ఈ సినిమా తర్వాత నాలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటి వివరాలు త్వరలోనే తెలియజేస్తాను' అని చెప్పారు.