Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లెజెండరీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై యష్ రాజ్, నవిమి గాయక్ జంటగా రామకృష్ణార్జున్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'అభిరామ్'. జింకా శ్రీనివాసులు నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైన సందర్భంగా ఇందులోని 'చాల్లే చాల్లే' అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను దర్శకుడు శివ నిర్వాణ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ, ''చాల్లే చాల్లే' బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ఇది. ఈ పాట వింటుంటే ఇంకా వినాలనిపించేలా చాలా క్యాచీగా ఉంది. మీనాక్షి భుజంగ్ మ్యూజిక్ కంపోజిషన్‌లో తనే ఈ పాటను పాడటం విశేషం.ఈ పాటలో విజువల్స్ చాలా బాగున్నాయి.హీరో,హీరోయిన్లు చాలా బాగా చేశారు. చంద్ర కిరణ్ కొరియోగ్రఫీ బాగుంది. దర్శక, నిర్మాతలకు ఈ సినిమా ద్వారా మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను' అని చెప్పారు.
'టిప్స్ ఆడియో మ్యూజిక్ ద్వారా విడుదలైన పాటలు మ్యూజిక్ లవర్స్ అందరినీ కచ్చితంగా అలరిస్తాయి. లవ్, యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ కలయికతో ఒక విన్నూత కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని త్వరలో మీ ముందుకు తీసుకువస్తాం' అని నిర్మాత జింకా శ్రీనివాసులు అన్నారు.
దర్శకుడు రామకృష్ణార్జున్ మాట్లాడుతూ,'నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది' అని తెలిపారు. శివబాలాజీ, నవీన్ రెడ్డి, బాహుబలి ప్రభాకర్, రఘు బాబు, కాదంబరి కిరణ్, అన్నపూర్ణమ్మ, తులసి, వై.విజయ, సుమన్ శెట్టి, విజయ రంగనాథ్, గౌతమ్ రాజు, జబర్దస్త్ శేషు, కిషోర్ దాస్ తదితరులు నటిస్తున్నారు.