Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అశ్విన్, రమేష్.కెసమర్పణలో పద్మావతి పిక్చర్స్ పతాకంపై, అభిషేక్ వర్మ, మనో చిత్ర జంటగా రూపొందుతున్న చిత్రం 'రూమ్'. పద్మమగన్ దర్శకత్వంలో వి.యస్. సుబ్బారావు నిర్మించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమైన సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, నటుడు బెనర్జీ, నిర్మాత రామరాజ్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
నిర్మాత రామారాజ్ మాట్లాడుతూ, 'దర్శకుడు కన్మణి మంచి సబ్జెక్టును సెలెక్ట్ చేసుకున్నాడు. మా అబ్బాయిని హీరోగా పెట్టి సినిమా తీసిన సుబ్బారావుకు థ్యాంక్స్' అని అన్నారు.
'ఈ సినిమాలో మంచి కథ ఉంది. ఇందులో అడల్ట్ కంటెంట్ ఉన్నా అది ఎంతవరకు ఉండాలో అంతే లిమిట్లో ఉంటుంది. ఈ సినిమాను 60 శాతం ఓకే రూమ్లో షూట్ చేశాం' అని చిత్ర దర్శకుడు పద్మ మగన్ తెలిపారు. హీరో అభిషేక్ వర్మ మాట్లాడుతూ,'ఈ సినిమా చూసిన వారంతా కచ్చితంగా నవ్వుకునేలా చాలా బాగుంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మ్యాజికల్ ఉంటుంది' అని అన్నారు. 'ఇప్పటి వరకు నేను 26 సినిమాలు చేశాను. ఈ సినిమా నాకు మంచి పేరు తెస్తుంది' అని హీరోయిన్ మనో చిత్ర అన్నారు. సహ నిర్మాత అశ్విన్ మాట్లాడుతూ' ఈ సినిమా బాగా వచ్చింది. త్వరలో వస్తున్న మా సినిమాను ప్రేక్షకులు అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను' అని తెలిపారు.