Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుధీర్ బాబు 18వ చిత్రానికి 'సెహరి' ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ ఎస్ సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఈ చిత్రానికి 'హరోం హర' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 'ది రివోల్ట్' అనేది ట్యాగ్ లైన్. టైటిల్ ఆధ్యాత్మికంగా ఉన్నప్పటికీ, ట్యాగ్‌లైన్ కథలోని ప్రతీకార కోణాన్ని సూచిస్తోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో 1989 నాటి కథ ఇది. సుబ్రమణ్య స్వామి ఆలయం, జగదాంబ టాకీస్, రైల్వే స్టేషన్ వంటి ప్రసిద్ధ ప్రదేశాలను వీడియోలో చూపించారు. మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో సుధీర్ బాబుని ఈ వీడియో ప్రజెంట్ చేసింది. ''ఇంగా సెప్పేదేం లేదు... సేసేదే...' అని చిత్తూరు యాసలో సుధీర్ బాబు చెప్పిన డైలాగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది. ఈచిత్రానికి సమర్పణ - రమేష్ కుమార్ జి, డీవోపీ - అరవింద్ విశ్వనాథన్.