Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాస్కేడ్ పిక్చర్స్ పతాకం పై రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న చిత్రం 'అలిపిరికి అల్లంత దూరంలో'. ఆనంద్ జె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యూనిక్ రాబరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 18న థియేటర్లో విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాతలు రూపొందించిన రిలీజ్ డేట్ ఎనౌన్స్మెంట్ వీడియో అందర్నీ ఆకట్టు కుంటోంది. వింటేజ్ డేస్‌ని గుర్తుకు తెస్తూ దండోరా వేయించడం అలరిస్తోంది. తిరుపతి నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. నూతన దర్శకుడు ఆనంద్ తన తొలి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ చూపించబోతున్నారని ప్రమోషనల్ మెటీరియల్ చూస్తే అర్థమవుతోంది.
రావణ్ నిట్టూరు, శ్రీ నిఖిత, అలంకృతషా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి, లహరి గుడివాడ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.