Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం 'తగ్గేదే లే'. యువ కథానాయకుడు నవీన్ చంద్ర లీడ్ రోల్లో నటించిన ఈ చిత్రానికి 'దండుపాళ్యం' ఫేమ్ శ్రీనివాస్ రాజు దర్శకత్వం వహించారు.
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ సినిమా ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరో నవీన్‌చంద్ర మీడియాతో పలు విశేషాలను షేర్చేసుకున్నారు.
ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. వెంటనే గ్రీన్‌సిగల్ ఇచ్చేశా..
కరోనా టైమ్‌లో దర్శకుడు శ్రీనివాసరాజు ఈ చిత్రకథని నెరేట్ చేశారు. ఆయన మార్క్‌లోనే ఉంటూ డిఫరెంట్‌గా ఈ కథ ఉండటంతో మరో ఆలోచన లేకుండా గ్రీన్‌సిగల్ ఇచ్చేశా. 'దండుపాళ్యం' సిరీస్ చిత్రాలతో శ్రీనివాసరాజు తనకంటూ ఓ బ్రాండ్‌ని క్రియేట్ చేసుకున్నారు.ఈ సినిమాలోనూ ఆయన మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్.
అదే ఈ కథలో ప్రత్యేకత..
ఈ సినిమాలో నేనొక హీరో అయితే, రవిశంకర్ మరో హీరో.. ఇద్దరు హీరోలు, పోలీసులు, గ్యాంగ్స్ మధ్య జరిగే ఆసక్తికర పరిణామాలే ఈ సినిమా. నాకు తెలియకుండానే మా ఇంట్లోనే ఓ హత్య జరుగుతుంది. దీన్ని ఇన్వెస్ట్గేట్ చేయటానికి పోలీసులు రంగంలోకి దిగుతారు. మా ఇంట్లో జరిగిన హ్యతకి, నాకు, పోలీసులకు, 'దండుపాళ్యం'లాంటి గ్యాంగ్‌కి ఏంటి సంబంధం?, భిన్న నేపథ్యాలు ఉన్న వీళ్ళందరూ ఓ పాయింట్ దగ్గర ఎలా కలుస్తారు?, ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఆద్యంతం ఉత్కంఠభరితం. దివ్యా పిళ్లై, అనన్య సేన్ గుప్తా, నాగబాబు, డానీ కుట్టప్ప, రవి కాలే, మకరంద్ దేశ్ పాండే, అయ్యప్ప పి.శర్మ, నవీన్ చంద్ర, పూజా గాంధీ, రాజా రవీంద్రల పాత్రలు అందర్నీ అలరిస్తాయి.
టైటిల్ బాగా ప్లస్ అయ్యింది
అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' చిత్రం ద్వారా బాగా పాపులర్ అయిన 'తగ్గేదేలే' పదాన్ని టైటిల్‌గా పెట్టడంతో మా సినిమా కి బాగా ప్లస్ అయ్యింది. ఆ పదం ఎంతగా అందరికీ రీచ్ అయ్యిందో, మా సినిమా గురించి కూడా అదే స్థాయిలో రీచ్ అయ్యింది. అలాగే టైటిల్‌కి తగ్గట్టుగానే సినిమా కూడా 'తగ్గేదేలే' రేంజ్‌లోనే ఉంటుంది.