Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలనాటి మేటి నటి ఎల్.విజయలక్ష్మికి ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ పురస్కారం లభించింది. 50 సంవత్సరాల తర్వాత మొదటి సారిగా తెనాలిలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆమెను వ్యక్తిగతంగా కలిసి అభినందనలు తెలియజేయాలని బాలకృష్ణ భావించి, సినీ ప్రముఖులు సమక్షంలో ఆమెకు గౌరవ సత్కారం చేశారు. బాలకృష్ణ మాట్లాడుతూ, '60 దశకంలో చలనచిత్ర పరిశ్రమను ముందుకు నడిపిన అతిరథులు నిర్మించిన చిత్రాల్లో విజయలక్ష్మి నట ప్రయాణాన్ని కొనసాగించారు. ఆమె వందకుపైగా సినిమాల్లో నటిస్తే అందులో 60కి పైగా నాన్నతో నటించారు. నాన్నని స్పూర్తిగా తీసుకుని అమెరికా వెళ్ళి సి.ఎ. చదివి వర్జీనియా యూనిర్శిటీలో బడ్జెట్ మేనేజర్‌గా ఉండటం చాలా విశేషం. ఆమె మహిళా సాధికారికతకు ప్రతీక. భావితరాలకు ఆదర్శం' అని అన్నారు. 'నేను చిన్నతనం నుంచి రామారావుని ఆదర్శంగా తీసుకునేదానిని. ఆయనతో నటించేటప్పుడు మొదట చాలా భయమేసేది. పెద్ద హీరో అని ఫీలింగ్ ఉండేదికాదు. ఆయనతో నటించేటప్పుడు చాలా విలువలు నేర్చుకున్నాను. క్రమశిక్షణ, మాటతీరు, సిన్సియారిటీ, చెప్పిందే చేయడం, అంకిత భావం, నిబద్ధత వంటి విషయాలు గ్రహించాను. సినిమాలు అయ్యాక నేను చదువుకున్నానంటే ఎన్.టి.ఆర్.స్పూర్తి వల్లే జరిగింది' అని ఎల్.విజయలక్ష్మి చెప్పారు.