Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన 'యశోద' థియేట్రికల్ ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ లభిస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ... అన్ని భాషల్లో, దేశంలోని అన్ని ప్రాంతాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ నెల11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో డూప్ లేకుండా సమంత యాక్షన్ సీన్స్ చేశారు. మంగళవారం యాక్షన్ సీన్స్ మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. సమంత డెడికేషన్, సినిమాలో యాక్షన్ సీన్స్ గురించి ఈ వీడియోలో హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ మాట్లాడుతూ, 'నేనెప్పుడూ యాక్టర్ సేఫ్‌గా ఉండేలా చూసుకుంటాను. వాళ్ళకు యాక్షన్ కొరియోగ్రఫీ పర్ఫెక్ట్గా తెలియాలి. అందుకని, ముందుగా స్టంట్ పెర్ఫార్మర్లతో ఫైట్ కంపొజిషన్ చూపిస్తాం. నటీనటులకు ట్రైనింగ్ ఇస్తాం. అందువల్ల, వాళ్ళకు టైమింగ్ తెలుస్తుంది. ఆ తర్వాత ఫైట్ తీస్తాం. సమంత చాలా డెడికేటెడ్‌గా షూటింగ్ చేస్తారు. ప్రతిసారి తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. యాక్షన్ డైరెక్టర్స్ కోరుకునేది కూడా అదే కదా! అందుకని, ఆమెతో షూటింగ్ చేయడం బావుంటుంది. యాక్షన్ ఎప్పుడూ రియల్‌గా ఉండటం నాకు ఇష్టం. 'యశోద'లో స్టంట్స్ కూడా రియల్‌గా ఉంటాయి. రియల్ లైఫ్‌లో ఎలా జరుగుతుందో ఇందులో యాక్షన్ కూడా అలాగే రియలిస్టిక్‌గా ఉంటుంది. కిక్ బాక్సింగ్, జూడో, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఈ యాక్షన్ సీన్స్‌లో ఉంటాయి' అని చెప్పారు.'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌కు యానిక్ బెన్ వర్క్ చేశారు.