Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవీన్ చంద్ర కథానాయకుడిగా భ్రద ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మాణంలో 'దండు పాళ్యం' ఫేమ్ శ్రీనివాస్ రాజు రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'తగ్గేదే లే'. ఈనెల 4న సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా నవీన్ చంద్ర మాట్లాడుతూ, 'ముందు లవ్ స్టోరీ అన్నారు. రొమాన్స్ చాలా ఎక్కువ ఉంది ఎలా అని అనుకున్నాను. కానీ ఇందులోకి సడెన్గా దండుపాళ్యం గ్యాంగ్ వచ్చింది. మూడు స్టోరీలను ఇందులో అద్భుతంగా సెట్ చేశారు. లవ్, యాక్షన్, వెంజెన్స్ ఇలా అన్నీ కూడా ఇమిడ్చి పెట్టారు. ఈ చిత్రం అద్భుతంగా ఉంటుంది. అందరికీ సినిమా నచ్చుతుంది' అని తెలిపారు.
'యదార్థ ఘటనలను చెప్పేందుకు మా భద్ర ప్రొడక్షన్ సంస్థను స్థాపించాం. ఇది మా మొదటి చిత్రం. దీన్ని దండుపాళ్యం నుంచి స్పూర్తిపొందాం' అని నిర్మాత ప్రేమ్ కుమార్ చెప్పారు.
డైరెక్టర్ శ్రీనివాస్ రాజ్ మాట్లాడుతూ, 'మంచి నటీనటులు, ప్రొడక్షన్ కంపెనీ దొరకడంతోనే ఈచిత్రం సాధ్యమైంది. నిర్మాత పీపీ రెడ్డి చేయి చాలా మంచిది. ఈ చిత్రానికి అన్నీ కుదిరాయి' అని అన్నారు.
'ప్రేమ్, అఖిల్, సుబ్బారెడ్డి మంచి చిత్రాలు తీద్దామని ఇండిస్టీకి వచ్చారు. మంచి కంటెంట్ చిత్రాలను తీయాలని అనుకుంటున్నారు. ఇలాంటి సినిమాలు ఆడితే.. ఈ బ్యానర్ ద్వారా అందరికీ పని దొరుకుతుంది' అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజా రవీంద్ర చెప్పారు.