Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నిజ జీవితంలో నేను చాలా స్ట్రెయిట్ ఫార్వడ్ అమ్మాయి. కెరీర్లో వేసే ప్రతి అడుగు మంచి స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచన ఉంటాను. 'ఊర్వశివో.. రాక్షసివో'లో నేను పోషించిన సింధూ పాత్ర కూడా అలాగే ఉంటుంది' అని నాయిక అనూ ఇమ్మాన్యుయేల్ అన్నారు. అల్లు శిరీష్ సరసన ఆమె నటించిన చిత్రం 'ఊర్వశివో.. రాక్షసివో'. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీఎ2 పిక్చర్స్ పతాకంపై ధీరజ్ మొగిలిలేని, విజరు ఎం నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పకుడు. ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకొస్తుందీ సినిమా.
ఈ సందర్భంగా నాయిక అను ఇమ్మాన్యూయేల్ మీడియాతో ముచ్చటించింది. 'ఇందులో సింధూ అనే సాఫ్ట్వేర్ అమ్మాయిగా నటించా. కెరీర్లో మంచి స్థాయికి ఎదగాలనే తపన ఉన్న అమ్మాయి. ఆమెకి ప్రేమ కావాలి. కానీ ప్రేమే జీవితం అనుకోదు. అలాంటి అమ్మాయికి శ్రీకుమార్ అనే సింపుల్ కుర్రాడు పరిచయం అవుతాడు. సింపుల్ కుర్రాడికి, కెరీర్ ఓరియెంటెడ్ అమ్మాయికి మధ్య ప్రేమకథ ఎలా నడించింది అనేదే కథ. హీరో, హీరోయిన్ క్యారెక్టర్స్ డిఫరెంట్ మైండ్‌సెట్‌తో కాంట్రాస్ట్‌గా ఉంటాయి. అదే సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. న్యూ ఏజ్ జోనర్ కథ ఇది. యూత్‌ని బాగా ఇంపాక్ట్ చేస్తుంది. డైరెక్టర్ కథ మొత్తం నెరేట్ చేశాక నేను, శిరీష్ కాఫీ షాప్‌లో కూర్చుని పాత్రల గురించి మాట్లాడుకున్నాం. ఒకరి తత్వం గురించి మరొకరం తెలుసుకున్నాం. శ్రీ, సింధూ పాత్రల్లో రియలిస్టిక్‌గా కనిపించడానికి కష్టపడ్డాం. స్క్రీన్‌పై మా ఇద్దరి మధ్య లవ్ సీన్స్, కెమిస్ట్రీ, ఎమోషన్స్ బాగా ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం రవితేజ గారితో 'రావణాసుర' చిత్రంలో నటిస్తున్నా. ఓటీటీ మీద కూడా దష్టిపెట్టాను' అని తెలిపారు.