Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కర్ణాటక సీనియర్ రాజకీయ నేత జమీర్ అహ్మద్ కుమారుడు జైద్‌ఖాన్, 'బెల్ బాటమ్' ఫేమ్ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'బనారస్'తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. సోనాల్ మోంటెరో కథానాయిక. ఎన్ కె ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తిలకరాజ్ బల్లాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 'నాంది' సతీష్ వర్మ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 4న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో దర్శకుడు జయతీర్థ మీడియాతో మాట్లాడుతూ, 'ఒక ప్రేమకథని వైవిధ్యంగా ప్రజంట్ చేయాలని భావించాను. నేను చెప్పిన కథ జైద్కి చాలా నచ్చింది. ఈ సినిమా కోసం కాశీ, బనారస్ పర్యటించిన తర్వాత షూటింగ్ మొదలుపెట్టాను. ఇది కేవలం టైం ట్రావెల్ సినిమా కాదు. ఒక ప్రేమకథ. రొమాంటిక్ స్టొరీ. అలాగే థ్రిల్లర్. వీటిలో టైం ట్రావెల్, టైం లూప్, పునర్జన్మ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. స్క్రీన్ ప్లే చాలా వైవిధ్యంగా ఉంటుంది. చాలా మిస్టికల్ డివైన్ అంశాలూ ఉన్నాయి. ప్రేక్షకులకు చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది. సెన్సార్ పూర్తి అయిన తర్వాత మా నిర్మాతలు సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. నిజానికి 'బనారస్' యూనివర్సల్ అప్పీల్ ఉన్న కంటెంట్. భారీ నిర్మాణ, సాంకేతిక విలువలతో తెరకెక్కించారు. ట్రైలర్, టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాకి అజినీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ హైలెట్ అవుతుంది. మేమిద్దరం కలిసి 'బెల్ బాటమ్' చేశాం. ఇందులో కూడా సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇందులో హీరోయిన్ సింగర్. వెస్ట్రన్, క్లాసిక్, ఫ్లోక్, డివైన్ ఇలా అన్నీ కోణాలు ఉన్న సంగీతం ఇందులో ఉంది. ప్రస్తుతం 'కైవ'అనే సినిమా చేస్తున్నాను. ఇప్పటికే షూటింగ్ మొదలైంది. జనవరిలో 'బెల్ బాటమ్ 2' ఉంటుంది' అని అన్నారు.