Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు సత్యదేవ్ నటిస్తున్న నూతన చిత్రం 'ఫుల్‌బాటిల్'. రామాంజనేయులు జవ్వాజి, ఎస్డీ కంపెనీ సంయుక్తంగా స్రవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు.
ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ అందరినీ మెప్పించింది. ఆ పోస్టర్‌కు విశేషమైన స్పందన లభించింది. లేటెస్ట్గా ఈ సినిమా నుంచి సత్య దేవ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఫస్ట్ లుక్ పోస్టర్లో సత్యదేవ్‌ను చూస్తుంటే, ఈ చిత్రం పూర్తిగా వినోదాత్మకంగా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది. పోస్టర్లో కాకినాడ పరిసర ప్రాంతాలు, ఆటో, సత్యదేవ్ కళ్లజోడు ఇవన్నీ చూస్తుంటే ఫుల్ ఫన్ గ్యారెంటీ అనిపిస్తోంది. మెర్క్యూరీ సూరి పాత్రలో సత్య దేవ్ అందరినీ అలరించనున్నాడు. సినిమా ఎంత వినోదాత్మకంగా ఉండబోతోందో ఈ పోస్టర్ చెప్పకనే చెప్పేసింది.
'తిమ్మరుసు' సినిమా తరువాత మళ్లీ సత్యదేవ్, శరణ్ కొప్పిశెట్టి కలిసి చేస్తోన్న చిత్రమిది. ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభమైంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సినిమా మీద మంచి అంచనాలు పెంచిందని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి సుజాత సిద్దార్థ్ సినిమాటోగ్రాఫర్‌గా, సంతోష్ కామిరెడ్డి ఎడిటర్‌గా, నవీన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. తేజ్ దిలీప్ విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.