Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్'. వెంకట్ బోయనపల్లి నిహారిక ఎంటర్టైన్మెంట్తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మించింది. ఫరియా అబ్దుల్లా కథానాయిక. ఈనెల 4న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో దర్శకుడు మేర్లపాక గాంధీ మీడియాతో సంభాషించారు.
'ఒక యూట్యుబర్ కథ చేస్తే బావుంటుందనే ఆలోచన మొదలైంది. ట్రావెల్ వ్లాగర్ కి ఉన్న కష్టాలు, ప్రమాదాలు, సవాళ్ళ బ్యాక్ డ్రాప్లో సినిమాని ప్లాన్ చేశాం. అయితే ఈ కథ చాలా హిలేరియస్‌గా ఉంటుంది. హీరో, హీరోయిన్ ఇద్దరూ ట్రావెల్ వ్లాగర్స్. వీరి మధ్య ఫైట్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ట్రావెల్ వీడియోలు షూట్ చేసే క్రమంలో ఎలాంటి ప్రమాదం ఎదుర్కొన్నారనేది కూడా ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఫస్ట్ ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకూ ఒక లాఫ్ రైడ్‌లా ఉంటుంది. అండర్ కరెంట్‌గా ఒక సమస్య రన్ అవుతూనే, ఆ పరిస్థితి నుండి వచ్చే సిట్చ్యువేషనల్ కామెడీ అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇందులో స్క్రీన్ ప్లే డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రతి పదిహేను నిమిషాలకు కథలో ఒక ఛేంజ్ ఓవర్, మలుపు ఉంటాయి. సంతోష్‌తో 'ఏక్ మినీ కథ' చేశాను. ఆ సినిమాలో తను అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో ఒక యంగ్ హీరో కావాలి. అందుకే ఈ కథని సంతోష్‌కి చెప్పాను. తనకి కథ చాలా బాగా నచ్చింది. సంతోష్, ఫరియా అబ్దుల్లా ఇద్దరూ ఈ కథకి పర్ఫెక్ట్గా సరిపోయారు. నిర్మాత వెంకట్ నా మీద నమ్మకంతో ఎక్కడా రాజీపడకుండా సినిమా నిర్మించారు. 'వాల్తేరు వీరయ్య' టీజర్లో చిరంజీవి 'లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్' అనే డైలాగ్ వాడగానే అందరూ మమ్మల్ని ట్యాగ్ చేశారు. చాలా ఆనందంగా అనిపించింది. ఏదో అద్భుతంగా జరగాలని ఎదురుచూశాం. చిరంజీవి రూపంలో మాకు అద్భుతం జరిగింది' అని దర్శకుడు మేర్లపాక గాంధీ అన్నారు.