Authorization
Mon Jan 19, 2015 06:51 pm
త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను దర్శకునిగా హొపరిచయం చేస్తూ శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన సినిమా 'నువ్వే నువ్వే'. ఇందులో తరుణ్, శ్రియ జంటగా నటించారు. అక్టోబర్ 10కి సినిమా విడుదలైహొ20 ఏళ్ళు అయ్యింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో స్పెషల్ షో వేశారు. అలాగే 'నువ్వే నువ్వే' అభిమానులకు మేకర్స్ ఓ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 4 నుంచి 7వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో సినిమానుహొప్రదర్శించనున్నారు.
నిర్మాత 'స్రవంతి' రవికిశోర్ మాట్లాడుతూ, 'మా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్ డే. 'నువ్వే నువ్వే' విడుదలై 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా స్పెషల్ షో వేసినప్పుడు వచ్చిన స్పందన నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఆ సమయంలో చాలా మంది సినిమాను రీ రిలీజ్ చేయమని అడిగారు. ఇప్పటికీహొఅడుగుతున్నారు. ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం మళ్ళీ రిలీజ్ చేస్తున్నాం. 2కెహొహెచ్డి ప్రింట్‌తో షోస్ వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో లిమిటెడ్ స్క్రీన్స్‌లో రీ రిలీజ్ చేస్తున్నాం' అని తెలిపారు.