Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నగేష్ నారదాసి దర్శకత్వంలో అప్సర రాణి ప్రధాన పాత్రలో రూపొందనున్న 'తలకోన' చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మంత్ర ఎంటర్టైన్మెంట్ పతాకంపై సల్లా కుమార్ యాదవ్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ నూతన చిత్ర ప్రారంభోత్సవ వేడుక గురువారం ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ చిత్రానికి నిర్మాత రామారావు కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత సి.కళ్యాణ్ ముహూర్తపు షాట్‌కి క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ, 'క్రైమ్ థ్రిల్లర్‌తో సాగే కథ ఇది. తలకోన ఫారెస్ట్‌లోకి కొంతమంది స్నేహితులు వెళ్తే ఏం జరిగిందనేది ప్రధానాంశంగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా రూపొందిస్తున్నాం. ఈ చిత్రాన్ని 20 రోజులు హైదరాబాద్‌లో, మరో 20 రోజులు తలకొనలో రెగ్యులర్ షూట్ చేయనున్నాం' అని తెలిపారు.
నిర్మాతల్లో ఒకరైన డి.శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ,'మంచి స్టోరీ. ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా' అని అన్నారు.