Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ పతాకంపై సిద్ స్వరూప్, ఆర్ కార్తికేయ, ఇందు ప్రియ, ప్రియ వల్లభి నటీనటులుగా నటిస్తున్న చిత్రం 'దోస్తాన్'.
సూర్య నారాయణ అక్కమ్మ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర టీజర్‌ను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి టీజర్‌ని లాంచ్ చేశారు.
నిర్మాత పద్మిని నాగులపల్లి మాట్లాడుతూ, 'ఫ్రెండ్స్ కాన్సెప్ట్‌తో ఇంతకుముందు 'ప్రేమదేశం', 'ప్రేమసందేశం' వంటి సినిమాలు వచ్చాయి. ఆ సినిమాల్లో ఇద్దరు ఫ్రెండ్స్ తమకున్న వాటిని షేర్ చేసుకుంటూ ఎలా లీడ్ చేశారో అలాంటి మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలి' అని అన్నారు.
దర్శక, నిర్మాత సూర్యనారాయణ అక్కమ్మ మాట్లాడుతూ, 'మా చిత్ర టీజర్‌ను విడుదల చేసిన పెద్దలకు ధన్యవాదాలు. నా భార్య కోరిక మేరకు నేను సినిమా తియ్యాలని ఎన్నో కథలు విన్నాను. అవేవి నాకు నచ్చలేదు. సిద్ స్వరూప్ అందించిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశాను. తుని, లంబసింగి, తలకోన, వరంగల్, హైదరాబాద్, వైజాగ్, కాకినాడ పోర్ట్ తదితర ప్రదేశాల్లో షూటింగ్ చేశాం. అన్ని వర్గాల వారిని ఆకట్టుకొనే ఈ సినిమా పూర్తి చేయడానికి 96 రోజులు పట్టింది. ఇందులోని ఫైట్స్ రియలిస్టిక్‌గా ఉంటాయి. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది' అని తెలిపారు.