Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడివి శేష్ కథానాయకుడిగా, శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'హిట్ 2'. 'ది సెకండ్ కేస్' ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి మొదటి భాగంగా వచ్చిన 'హిట్' సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరించింది. 'హిట్ 2' చిత్రం డిసెంబర్ 2న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా గురువారం ఈ చిత్ర టీజర్‌ని విడుదల చేశారు.
నిర్మాత ప్రశాంతి త్రిపిరనేని మాట్లాడుతూ, 'అందరిలా నేను కూడా స్క్రీన్‌పై ఈ సినిమా చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను' అని అన్నారు. 'ఈ సినిమాలో కె.డి అనే క్యారెక్టర్ ఎలా ఉండాలని అనుకున్నానో, దాని కంటే నాలుగైదు రెట్లు బాగానే అడివిశేష్ ప్రెజంట్ చేశాడు. నేను హీరోయిన్ని ఎలా కావాలనుకున్నానో దాన్ని అలాగే మీనాక్షి చౌదరి పోట్రేట్ చేసింది. రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని వంటి సీనియర్ ఆర్టిస్టులతో పనిచేసే అవకాశం దక్కింది. నేను ఇక్కడ ఉండటానికి కారణం నాని. 'హిట్ వెర్సె'కి వచ్చిన రెస్పాన్స్ చూసి ఆశ్చర్యమేసింది. హిట్ యూనివర్స్‌ని ఇంకా గొప్పగా ఇవ్వాలనే ఇన్స్పిరేషన్ ఇచ్చింది' అని డైరెక్టర్ శైలేష్ కొలను చెప్పారు. నాయిక మీనాక్షి చౌదరి మాట్లాడుతూ, 'టీజర్ నచ్చిందని అందరికీ అర్థమైంది. మూవీ నాకు చాలా స్పెషల్. తెలుగులో ఇది నా మూడో చిత్రం. ఆర్య అనే అమ్మాయి రోల్ ఇచ్చిన శైలేష్‌కి థ్యాంక్స్. నేను ఆ పాత్రకు న్యాయం చేశానని అనుకుంటున్నాను. శేష్ వండర్ ఫుల్ ఆర్టిస్ట్. తనతో కలిసి పని చేయటాన్ని అదష్టంగా భావిస్తున్నాను' అని తెలిపారు. 'చాలా ఎగ్జైటింగ్‌గా అనిపిస్తోంది. నా ఫేవరేట్ హీరో నాని. 'గూఢచారి, ఎవరు' సినిమాల ట్రైలర్స్‌ని తనే లాంచ్ చేశారు. ఓరోజు సడెన్‌గా వచ్చి ట్రైలర్స్ లాంచ్ చేయటం కాదు..ఓ హిట్ సినిమాను ప్రొడ్యూస్ చేస్తామని అన్నారు. ఈ సినిమా అలా లైన్లోకి వచ్చింది. ఈ సినిమా చాలా బావుంటుంది. ఎంజారు చేస్తారు. హిట్ వెర్సెలో డిఫరెంట్ విజన్స్ ఉన్నాయి. అందుకనే ఇందులో నేను యాక్ట్ చేశాను. హిట్ 1 క్వశ్చన్స్‌తో థ్రిల్ చేస్తే.. హిట్ 2 భయపెట్టి థ్రిల్ చేస్తుంది. శైలేష్ నన్ను కొత్తగా చూపించాడు. మీనాక్షి చౌదరి టాలెంటెడ్ ఆర్టిస్ట్. నేచురల్ పెర్ఫామెన్స్ ఇచ్చింది' అని హీరో అడివి శేష్ చెప్పారు.