Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-వీణవంక:
మండలంలో ఇటీవల మద్యం తాగి పట్టుబడిన 23 మందికి హుజురాబాద్ కోర్టు రూ.26,500 జరిమానా విధించినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో ఎస్సై శేఖర్ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు గురై కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని చెప్పారు. కావున మద్యం తాగి వాహనాలు నడపొద్దని, తాగి నడిపితే పోలీసులకు పట్టుబడితే కఠిన చర్యల తప్పవని హెచ్చరించారు. వాహనాలు నడుపుతున్న సమయంలో వాహన పత్రాలు ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దుకు సిఫార్సు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మద్యం తాగి పోలీసులకు పట్టుబడిన వారి కుటుంబ సభ్యుల సమక్షంలో వారికి కౌన్సిలింగ్ చేసినట్లు పేర్కొన్నారు.