Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న పక్కా మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ 'గాలోడు'. గెహ్నా సిప్పి కథానాయిక. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడు. ప్రకృతి సమర్పణలో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
'ఈ ట్రైలర్‌తో సినిమా ఎలా ఉండబోతుందో ముందే హింట్ ఇచ్చారు మేకర్స్. ఫస్ట్ టైమ్ సుధీర్ మాస్‌లుక్‌లో చేసే యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఒకవైపు మాస్ లుక్‌లో ఆకట్టుకుంటూనే మరోవైపు స్టైలీష్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ని ఖుషీ చేశారు. రామాయణంలో ఒక్కటే మాయ లేడీ ఇక్కడ అందరు మాయ లేడీలే..వంటి డైలాగ్స్‌లో ఎంటర్టైన్ చేస్తూనే 'వాడిది మామూలు రేంజ్ కాదు మాఫియా రేంజ్, సైనైడ్, యాసిడ్ కంటే డేంజర్‌రా వాడు, రాక్షసుల గురించి పుస్తకాల్లో చదివాను, విన్నాను మొట్టమొదటి సారి వీడిలో చూశాను సార్' వంటి పవర్ఫుల్ డైలాగ్స్ సినిమాపై అంచనాల్ని రెట్టింపు చేశాయి. గెహ్నాసిప్పి గ్లామర్, సప్తగిరి కామెడీ టైమింగ్ ట్రైలర్‌కు అదనపు ఆకర్షణలుగా నిలిచాయి. సినిమాటోగ్రాఫర్ సి. రాంప్రసాద్ విజువల్స్, మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్ట్ లెవల్లో ఉన్నాయి. టైటిల్ ఎనౌన్స్ చేసినప్పటినుండే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కి విశేష ఆదరణ లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఈనెల 18న గ్రాండ్ రిలీజ్ కానుంది' అని చిత్ర బృందం తెలిపింది. పథ్విరాజ్, శకలక శంకర్, సత్య క్రిష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: భిక్షపతి తుమ్మల.