Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజేశ్వర్ రాచర్ల సమర్పణలో విష్ణు ప్రియ సినీ కంబైన్స్ పతాకంపై అక్కినేని నాగేశ్వరావు, జయసుధ జంటగా కె.యస్. ప్రకాషరావు దర్శకత్వంలో జాగర్ల మూడి రాధాకృష్ణమూర్తి నిర్మించిన చిత్రం 'ప్రతిబింబాలు'. 40 సంవత్సరాల తర్వాత ఈ చిత్రాన్ని మొదటిసారిగా 250 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ,'నేను తీసిన సినిమాలు అన్నీ విజయం సాధించాయి. ఆ సినిమాలను చూసి నాగేశ్వరావు నన్ను పిలిచి నాతో సినిమా చెయ్యమని కాల్ సీట్స్ ఇచ్చారు. 1982లో ఈ సినిమా స్టార్ట్ చేసి, ఏకధాటిగా షూట్ చేశాం. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమా కొంత షూట్ ఉందనగా ఆయన హార్ట్ స్ట్రోక్ రావడంతో అమెరికా వెళ్ళారు. పూర్తి ఆరోగ్యంతో రెండు సంవత్సరాల తర్వాత వచ్చిన ఆయన షూటింగ్ పెట్టుకోమన్నాడు. కానీ ప్రెగెగ్సీ కారణంగా జయసుధ డెలివరీ అయ్యే వరకు షూటింగ్ చేయలేని చెప్పారు. ఆ తర్వాత ఇద్దరూ డేట్స్ ఇస్తే డైరెక్టర్ రాలేకపోయారు. ఈ విషయంలో ఎన్నారే కలిపించుకుని దర్శకుడిని సినిమా పూర్తి చేయమని చెప్పారు. ఇదంతా ఓ ఎత్తయితే, రీ రికార్డింగ్ టైమ్లో మాకు అడ్వాన్స్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ వెనక్కి వెళ్లడంతో ఫైనాన్స్ పరమైన ఇబ్బందులతో ఈ సినిమా ఆగిపోయింది. దీంతో గత 40 సంవత్సరాల నుండి పడుతున్న ఆరాటం అంతా ఇంతా కాదు. చివరకు నా సినిమా రిలీజ్ చేయకుండా చనిపోతానేమో అనుకున్న టైమ్లో రాచర్ల రాజేశ్వర్రావు రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు. ఈ నెల 5న విడుదల అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుంది' అని చెప్పారు.
'సినిమా చాలా బాగుంది. ఇలాంటి సినిమా మళ్ళీ రాదు, రాబోదు. అక్కినేని సినిమా రిలీజ్ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సినిమా గొప్ప విజయం సాధించి జాగర్ల మూడి రాధాకృష్ణ మూర్తికి ఎక్కువ డబ్బులు రావాలని ఆశిస్తున్నాను' అని నిర్మాత రాచర్ల రాజేశ్వర్ రావు అన్నారు.